Thursday, 30 July 2026 06:43:57 PM

ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు...

బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీరటీ శ్రీనివాస్...

Date : 30 April 2025 11:22 PM Views : 637

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా ప్రధాన వైద్య అధికారిణికే రక్షణ లేదని,కాంగ్రెస్ నేతలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ఒక డాక్టర్ ను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీరటీ శ్రీనివాస్ ఒక్క ప్రకటనలో ఆరోపించారు. జిల్లా అధికారిణి పైగా దళిత మహిళా అని చూడకుండా నానా దుర్భాషలతో, దూషించడం నాకు ప్రాణహాని ఉందని అ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వెళ్లడం సిగ్గుచేటని అన్నారు.గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదని దళిత కాంగ్రెస్ నాయకులే దళిత మహిళా అధికారిణి వేధించటం శోచనీయమని అన్నారు.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలని చూస్తూ ఊరుకుంటే భవిషత్ లో ఇంకో అధికారికి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిపారు. నీజయితిగా పని చేసే అవకాశం కల్పించాలని డీఎంహెచ్ఓ పై పెట్టిన అక్రమ కేసులను కాంగ్రెస్ నాయకులు ఉపసంహరుంచుకోవాలని డిమాండ్ ఒక్క ప్రకటనలో డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :