Thursday, 30 July 2026 06:02:18 PM

శాంతియుత వాతావరణంలో కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు

Date : 13 April 2025 08:56 PM Views : 433

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో బ్యాలెట్ పద్ధతిలో ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించారు ఈ ఎన్నికల్లో గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సహజ రాజేందర్ గా పిలవబడే కజంపురం రాజేందర్ రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి ప్రధాన కార్యదర్శిగా బరిలో నిలిచారు, పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి మాడూరి వినోద్ అధ్యక్షునిగా బరిలో నిలిచారు వీరే కాకుండా ప్రత్యర్థి వర్గం సైతం పోటా పోటీగా బరిలో నిలిచినప్పటికీ పెద్దపల్లి జిల్లాలోని నలుమూల ప్రాంతాల నుంచి అందరితో కలుపుగోలుగా ఉంటూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆప్యాయతతో పలకరిస్తున్న సహజ రాజేందర్ వర్గానికి వాలెట్ పద్ధతిలో పట్టం కట్టారు మాడూరి వినోద్ ని అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా కజంపురం రాజేందర్ ని బ్యాలెట్ పద్ధతిలో ఎన్నుకొని పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులంతా ఒక కుటుంబమని నిరూపించారు ఈ సందర్భంగా వినోద్ కజంపురం రాజేందర్లు మాట్లాడుతూ తమ మీద నమ్మకంతో గెలిపించిన అసోసియేషన్ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తమ కుటుంబ సభ్యులుగా భావించి ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు ఐక్యతతో ఉంటే ఏదైనా సాధించవచ్చని తమ అసోసియేషన్ సభ్యులు నిరూపించారని తమ మీద నమ్మకం ఉంచిన ప్రతి అసోసియేషన్ సభ్యునికి వారు కృతజ్ఞతలు తెలిపారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :