Saturday, 13 June 2026 02:45:54 PM

సింగరేణి కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి...

ఈనెల 20న జరిగే చలో హైదరాబాద్, ఇంద్ర పార్క్ వద్ద మహాధర్నను జయప్రదం చేయండి... జిల్లా సహాయ కార్యదర్శి సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఈ నరేష్

Date : 17 February 2025 02:39 PM Views : 470

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసారు. ఈనెల 20న సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్, ఇంద్ర పార్క్ వద్ద మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సింగరేణి RG.1. 1 ఇంక్లైన్ గని వద్ద సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ, ఐ ఎఫ్ టీ యు ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ చేసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్,ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర నాయకులు ఈదునూరి రామకృష్ణలు పాల్గొని మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.కార్మికులకు సొంత ఇంటి పథకం అలాగే 20 లక్షల వడ్డీ లేని రుణం,సింగరేణి పరిరక్షణ, కొత్త భూగర్భ గనులు ,కోల్ బ్లాకులు సింగరేణికి ఇవ్వాలని, వన్ టైం సెటిల్మెంట్ క్రింద మానవత దృక్పథంతో డిపెండెంట్ కార్మికుల మారు పేర్లను సవరించి వెంటనే వారికి ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.డిస్మిస్ కార్మికులకు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని, సర్ఫేస్ లో ఖాళీలను పూర్తి చేయాలని,సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని,ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న జరిగే చలో హైదరాబాద్ ఇంద్ర పార్క్ వద్ద జరిగే మహా ధర్నాలో అధిక సంఖ్యలో కార్మికుల పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ, ఐ ఎఫ్ టి యు నాయకులు జి మల్లేశం, ఎస్ ప్రసాద్,శ్రీకాంత్, శేఖర్, రవికుమార్. తదితరుల తో పాటు కార్మికులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :