ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : అక్రమ నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ ఏసిపి అండగా నిలుస్తున్నారని విబారిపై చర్యలు తీసుకోకపోతే కార్పోరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య హెచ్చరించారు.రామగుండం కార్పొరేషన్ పరిధిలోని కాశిపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనారు. అక్రమంగా నిర్మించిన హోటల్ శ్రీమయి లగ్జరీ వెనకాల నూతన భవనాన్ని తొలగించాలని రామగుండం నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ అరుణశ్రీకి ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులలో చలనం లేదని, అక్రమ నిర్మాణాలకు అండగా ఉన్న టౌన్ ప్లానింగ్ ఏసిపి ని అధికారులకు వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య డిమాండ్ చేసారు. స్తానిక భాస్కర్ రావు భవన్ లో మంగళవారం జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య AIYF ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మార్కపురి సూర్య హాజరై మాట్లాడుతూ...రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అనుమతులు మంజూరు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.కార్పొరేషన్ పరిధిలోని కాశిపల్లిలో శ్రీ మై లగ్జరీ హోటల్ వెనకాల ఒక పెద్ద భవనం నూతనంగా నిర్మాణం జరిగిందని ఆ యొక్క భవనానికి ఎలాంటి సెల్లార్ అనుమతులు తీసుకోకుండా గ్రౌండ్ ఫ్లోర్ అనుమతితో అక్రమంగా సెల్లార్ ను నిర్మించడం జరిగిందని మరి అనుమతి ఇవ్వడానికి ఆ భవనాన్ని సందర్శించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ విధంగా అనుమతిచ్చారో తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ నిర్మాణం జరుగుతున్నప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూతన మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 174(5), 178(1) మరియు 181(2) ప్రకారం ఈ అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నూతన భవనం నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఇన్స్పెక్షన్ కి వెళ్లకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు భవనం పూర్తయిన అనంతరం అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పెనాల్టీ వేసి చేతులు దులుపుకోవడం సరి అయిన చర్య కాదని అన్నారు. అనుమతి లేకుండా చిన్న రేకుల షెడ్డు వేసుకుంటేనే హుటాహుటిన టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి నిర్మాణాలను కూలగొడుతున్న అధికారులకు పారిశ్రామిక ప్రాంతంలో ఇంత పెద్ద భవనం అక్రమ నిర్మాణం అని తెలిసిన ఫిర్యాదు చేసిన పట్టించుకోక పోవడం అధికారుల అవినీతికి నిదర్శనమని అన్నారు. కార్పొరేషన్ ప్రాంతంలో ఉన్నోళ్లకు ఒక చట్టం లేనోళ్లకు ఒక చట్టం లాగా కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరించడాన్ని తప్పుబట్టారు.కాశిపల్లి లో అక్రమంగా నిర్మాణం జరుగుతున్న భవనంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే రామగుండం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు సాదుల శివ , ఆసాల నవీన్ రాణవేణి సుధీర్ కుమార్ , వినయ్ కుమార్, మహేష్ పాల్గొన్నారు.
Admin
Aakanksha News