Sunday, 26 April 2026 05:30:56 PM

భగత్ సింగ్ స్ఫూర్తితో మతతత్వశక్తులకు వ్యతిరేకంగా పోరాడుదాం...

భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా వాల్ పోస్టర్ విడుదల...

Date : 21 March 2025 06:54 PM Views : 358

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : స్వాతంత్ర సమరయోధుడు కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అఖిలభారత యువజన సమాఖ్య(AIYF) పెద్దపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా AIYF జిల్లా అధ్యక కార్యదర్శి ఆరెపల్లి మానస్, మార్కపురి సూర్య మాట్లాడుతూ "స్వాతంత్ర సంగ్రామంలో ఉరితాడును ముద్దాడిన యోధుడు సర్దార్ భగత్ సింగ్ అని అతని జీవితం ఎంతోమంది యువకులకు ఆదర్శమని వారన్నారు. 23 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించే విధంగా పార్లమెంట్ పై బాంబు వేసి తన స్వతంత్ర కాంక్షను తెలియజేసిన ధీరుడు కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్ అని అంతేకాకుండా స్వతంత్ర సంగ్రామంలో లాలా లజపతిరాయ్, గాంధీజీలు చేసే ఉద్యమానికి ఆకర్షితుడైన భగత్ సింగ్ విద్యార్థి దశనుండే స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనడం తో పాటు బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన ధీరుడు భగత్ సింగ్ అని అన్నారు .1931 మార్చ్ 24 న భగత్ సింగ్ తో పాటు రాజ్ గురూ ,సుఖ్ దేవ్ లను ఉరితీయాలని నిర్ణయించినప్పటికీ అప్పటి చట్టాలకు వ్యతిరేకంగా 23న రాత్రి ఆ ముగ్గురిని ఉరితీసి ముక్కలుగా నరికి సట్లైజ్ నదిలో కలపడం జరిగిందని దాన్ని నిరసిస్తూ ఆనాడే వేలాది మంది ప్రజలు ఆ రాత్రంతా కాగడాలతో జైలు పరిసరాలను ముట్టడించారని వారు తెలిపారు. బ్రిటిష్ పాలకుల క్షమాభిక్షను తన అరికాలితో తన్ని ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ను పక్కనబెట్టి బ్రిటిష్ పాలకుల క్షమాభిక్ష పై బయటికి వచ్చి వారి అడుగులకు మడుగులొత్తిన సావర్కర్ జీవిత చరిత్రను ఈరోజు పాఠ్యపుస్తకాలో చేర్చడం దుర్మార్గ చర్యని అన్నారు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించాలని , అలాగే భగత్ సింగ్ ను స్వాతంత్ర సమరయోధుడు గా గుర్తించి ఆయన జయంతి వర్ధంతి లను ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న విద్యార్థి యువత భగత్ సింగ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మత చాందసవాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో AIYF జిల్లా ఆఫీస్ బేరర్స్ మాచర్ల అంజి, తాళ్లపల్లి సురేందర్ , చంద్రగిరి ఉదయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :