Thursday, 30 July 2026 08:00:55 PM

సమ్మె విఫలయత్నానికి ఫలించని ప్రయత్నాలు....

ఎరువుల కర్మగారంలో టోకెన్ సమ్మెకు కార్మికుల మద్దతు.... అంబటి నరేష్...

Date : 07 March 2025 08:42 AM Views : 602

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ తో RFCL మజ్దూర్ యూనియన్ నాయకులు అంబటి నరేష్ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ఈ సమ్మెకు మద్దతుగా కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో ఎరువుల కర్మాగారం పరిసర ప్రాంతాలు నిర్మానుషంగా మారాయి. ఈ సందర్భంగా అంబటి నరేష్ మాట్లాడుతూ... కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని వారికి ఇన్సెంటివ్ తో పాటు తదితర సౌకర్యాలను కల్పించాలని రెండు సంవత్సరాలుగా RLC చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై RFCL యాజమాన్యం RLC కి ఆర్ ఎఫ్ ఎల్ కాంట్రాక్టు కార్మికులతో మాకు ఎటువంటి సంబంధం లేదని కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే సంబంధమని యాజమాన్యం లేఖ రాసిందన్నారు. ఈ టోకెన్ సమ్మెకు కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించాలని అయితే ఈ సమ్మెను నిర్వీర్యం చేయడానికి కొందరు కుట్రలకు తెర లేపారని విమర్శించారు. ఎవరిని కుట్రలు చేసిన కార్మికులు న్యాయం వైపు నిలుస్తారు అన్నారు. ఇప్పటికైనా RFCL యాజమాన్యం దిగివచ్చి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :