ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ శివారు గోదావరి ఇసుక తిన్నెల్లో బిఆర్ఎస్ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రికెట్, ఖో-ఖో, కబడ్డీ వంటి ఆటల పోటీలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి గోదావరిని నిండుకుండలుగా మార్చి, సాగునీరు, తాగునీరు అందించారని గుర్తుచేశారు. అయితే, గత 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి నీరు అందించక, గోదావరిని ఎడారిలా మార్చిందని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ పాలనలో పడవ పోటీలు జరిగిన గోదావరి, ఇప్పుడు ఇసుక మైదానంగా మారిందని ఎద్దేవా చేశారు.ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అబద్ధ ప్రచారం చేసి ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు ప్రాజెక్టు మరమ్మత్తులు చేయకుండా రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పంటలు ఎండిపోకుండా తక్షణమే కన్నెపెల్లి పంప్ హౌజ్ నుండి నీటిని విడుదల చేసి, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రైతాంగం దెబ్బతింటోందని మండిపడ్డారు. కోరుకంటి చందర్ స్పష్టం చేసినట్లుగా, “గోదావరిని ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్‌కే చెందుతుందని, రైతులకు నీరు ఇవ్వని ఈ పాలన, ప్రజల కళ్లలో కన్నీళ్లు మిగులుస్తుందని బహిరంగంగా నిలదీశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణ వేణీ, గాదం విజయ, బాదె అంజలి, టిబిజికెస్ నాయకులు పర్లపల్లి రవి, నూనె కోమురయ్య, వడ్డెపల్లి శంకర్, అచ్చే వేణు, తోకల రమేష్, చెలకలపల్లి శ్రీనివాస్, నారాయణదాసు, మారుతి, కాల్వ శ్రీనివాస్, పీచర శ్రీనివాస్, జక్కుల తిరుపతి, అల్లం అయులయ్య, కేశవ గౌడ్, ఇరుగురాళ్ల శ్రావన్, చింటూ, సట్టు శ్రీనివాస్, కలవేని రవీందర్, భాను చంద్ర్, నూతి తిరుపతి, గంపుల లక్ష్మి, ఆర్శనపల్లి శ్రీనివాస్, బండారి ప్రవీన్, గుర్రం పద్మ, సూజాత, లక్ష్మి, బుర్ర వెంకటేష్, ఆవునూరి వెంకటేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News