Friday, 31 July 2026 01:33:10 PM

రామగుండం పోలీస్ కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా...

Date : 07 March 2025 04:37 PM Views : 675

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : తెలంగాణాలో పలువురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ గా ఉన్న శ్రీనివాస్ ను సిఐడికి బదిలీ చేయగా అయన స్థానంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ను రామగుండంకు బదిలీ చేసినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి.2009 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అంబర్ కిషోర్ ఝా మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా 2012లో వరంగల్ ఓ ఎస్ అదనపు ఎస్పీగా పని చేయడంతో పాటు 2014లో వరంగల్ ఎస్పీగా పనిచేసి తెలంగాణ ఏర్పాటు అనంతరం భద్రాది కొత్తగూడెం తోలి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అలాగే 2018లో హైదరాబాద్ సౌత్ డిసిపి గా అదే సంవత్సరంలో కేంద్ర సర్వీసులోనూ విధులు నిర్వహించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :