Thursday, 30 July 2026 01:34:03 PM

దేశంలో మెుదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే...

కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి

Date : 03 January 2025 03:48 PM Views : 829

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా అణగారిన మహిళలకు అక్షర జ్ఞానం అందించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఈ సందర్బంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని కృష్ణవేణి విద్యాసంస్థలలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ... అట్టడుగు వర్గాల మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో, ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు ప్రారంభించారని కొనియాడారు. 1848 లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళా ఉపాధ్యాయురాలు అని పేర్కొన్నారు. పట్టు వీడక సావిత్రిబాయి పూలే సాగించిన విద్యా ఉద్యమానికి అతి తక్కువ కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయన్నారు.మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి చైతన్యపరచడానికి మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించిందన్నారు.ఈ మహనీయురాలని జయంతిని మహిళా దినోత్సవంగా జరుపుకోవడం మహిళలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేసి నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిన మహనీయులని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :