ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు సేవలు శిరస్మరణీయమని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శ్రీపాదరావు 26వ వర్దంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మంథని పట్టణంలోని శ్రీపాద చౌక్, రావుల చెరువు కట్ట సమీపంలోని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజాభిమానాన్ని చురగొన్న గొప్ప నాయకుడు శ్రీ పాద రావు అని ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. మంథని ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత శ్రీపాదరావుకే దక్కుతుందన్నారు. 1999 ఏప్రిల్ 13 జరిగిన సంఘటన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నేటికి మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఒక కుటుంబ సభ్యుని కోల్పోయిన విధంగా గుర్తు చేసుకుంటూ నేటి వరకు కూడా మర్చిపోలేదంటే ఇది మాకు స్ఫూర్తిదాయకమైన విషయమన్నారు. మా తండ్రి మరణం అనంతరం అయన అడుగుజాడల్లో నడవాలని ఉద్దేశంతో వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని శ్రీపాదరావు ఆశయ సాధనకు పాటుపడతామన్నారు. చిల్లర రాజకీయాలకు మా కుటుంబం ఎప్పుడు దూరంగా ఉంటుందని, ప్రజాసేవలో మేము ఎల్లప్పుడూ ముందుకెళ్తామని, ప్రజలకు సేవ చేయడానికి మా కుటుంబం ముందుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్ట సమయంలో మా వేన్నంటి ఉండి మాకు చేయూతను అందించినా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల, పట్టణ, అన్నీ విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.
Admin
Aakanksha News