Thursday, 30 July 2026 01:21:02 PM

దొంగతనాలు చేసి విల్లాలు కట్టినట్లు కాదు... కష్టపడి ఇల్లు కట్టాలి... బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశికహరి ధ్వజం..

16 నెలలుగా కూల్చివేతలు తప్ప అభివృద్ధి కనిపించడం లేదు... రామగుండం సర్వనాశనానికే కోరుకుంటున్నారా...

Date : 21 December 2025 09:10 PM Views : 758

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : దొంగతనాలు చేసి విల్లాలు కట్టుకొని విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడం కాదు. కష్టపడి పనిచేసి ఇల్లు కట్టి చూపించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశికహరి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఉన్న సిరిశెట్టి మల్లేష్ దుకాణ సముదాయాన్ని కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత 16 నెలలుగా రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలు తప్ప ఇటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.ఎక్కడ చూసిన కూల్చివేతలతో ప్రజలు రోడ్డు మీద పడే పరిస్థితిలో వచ్చాయని వారి కన్నీటి బాధలు మీకు కనిపించడం లేదా అని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ను ప్రశ్నించారు. దీనికి సంబంధించిన పూర్తి వార్తా కథనం రేపటి ఆకాంక్ష న్యూస్ లో

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :