Thursday, 30 July 2026 12:26:02 PM

లారీలపై మట్టి బరువు పరిమితి కట్టుబాట్లు విధించాలి....పెద్దపల్లి జిల్లా ఓదెలలో అధిక మట్టి లోడ్‌తో వెళ్తున్న లారీలపై స్థానికుల ఆందోళన...

మట్టి తగలకుండా తార్పులీను కప్పడం, ఫిట్‌గా కవరింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలి...పోత్కపల్లి వ్యాపార సంఘం, ఆటో యూనియన్ నిరసన....

Date : 05 June 2025 06:24 AM Views : 613

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన పోత్కపల్లి గ్రామంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున ప్రజలు లారీల నిరసనకు దిగారు. ఇందుర్తి నుండి సుల్తానాబాద్ వైపు అధిక మట్టి లోడ్‌తో వెళ్తున్న లారీల వలన రోడ్డుమీద భారీగా మట్టి గడ్డలు కింద పడిపోతుండటంతో తీవ్రమైన దుమ్ము ధూళి ఏర్పడుతూ ప్రయాణికులకి, చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకి నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు.ఈ దుష్పరిణామాన్ని గమనించిన పోత్కపల్లి వ్యాపార సంఘం మరియు ఆటో యూనియన్ సభ్యులు కలసి బుధవారం ఉదయం ఆ లారీలను అడ్డగించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. "లారీలు అధిక లోడ్ తీసుకెళ్తూ, రోడ్లపై మట్టిని పారబోస్తున్నాయి. ఫలితంగా తీరని దుమ్ము ప్రాణాలు పుత్తడిస్తున్నట్లుగా మారింది. పిల్లలు, వృద్ధులు తిన్నగా ఊపిరి తీసుకోలేని పరిస్థితి నెలకొంది" అని వారు వాపోయారు.ఈ నిరసన కార్యక్రమంలో బీజేవైఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి పుల్లూరి పృథ్విరాజ్, వ్యాపారులు ఈర్కుల శ్రీనివాస్, పుల్లూరి భాస్కర్, కొండన్న, గర్రెపెల్లి కిషన్, మాచర్ల శంకర్, ఆటో యూనియన్ అధ్యక్షులు రంగు ఆనంద్ గౌడ్, సభ్యులు మహేష్, రాజేందర్, లడ్డు, అబ్బు, రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

అధికారుల నిర్లక్ష్యం పై మండిపడుతున్న ప్రజలు...

స్థానికులు మండల అధికారులు, ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌ నిర్లక్ష్యాన్ని కుండబద్ధలు కొడుతున్నారు. "ప్రతి రోజు వందల సంఖ్యలో లారీలు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. కానీ ఒక్కరి దృష్టి కూడా ఈ సమస్యలపై పడటం లేదు. మట్టి దిగుబడి ఎక్కడ, ఎంత వరకు అనుమతిచ్చారు? ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి అనే విషయాలను పక్కనబెట్టి, సంపాదన దృష్టితో ప్రజల ఆరోగ్యాన్ని తృణప్రాయంగా భావిస్తున్నారు" అంటూ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :