Sunday, 26 April 2026 06:47:11 PM

వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి.....

ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు డిమాండ్... పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ...

Date : 12 April 2025 05:03 PM Views : 297

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : వక్ప్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్, డీసెంట్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం సాయంత్రం ముస్లిం సోదరులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా మరియు ఇతర ప్రాంతాల: నుండి వచ్చిన ప్రఖ్యాత ఇస్లామిక్ పండితులు, సమాజ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిందని, దీనివల్ల సమాజంలో ముస్లిం ఆస్తులపై ముస్లింలు హక్కులు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కావాలనే దురుద్దేశంతో ఈ బిల్లును తీసుకొచ్చిందని, దీనివల్ల దేశంలో లాభం కంటే నష్టమే ఎక్కువ అని అన్నారు. ఈ బిల్లును పార్లమెంట్లో, రాజ్యసభలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం తెలపడంలో కనీసం ముస్లిం మత పెద్దల సూచనలు తీసుకోకుండా ఏకపక్షంగా బిల్లును ఆమోదించారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ముస్లిం సమాజం మేలుకొని ఈ బిల్లుని రద్దు చేసే వరకు తమ ఆందోళనను కొనసావిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరమైతే ఈ బిల్లు రద్దు కోసం న్యాయ పోరాటం కూడా చేస్తామని, భారత రాజ్యాంగం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఫ్తీ సాదిక్ మొహియుద్దిన్ ఫహీమీ, మౌలానా ఘయాజ్ అహ్మద్ రషాది, షేక్ రుక్నుద్దిన్ ,ముఫ్తీ మజహర్ ఖాస్మీ, ఉస్మాన్, ఫక్రుద్దీన్, ముఫ్తీ సయ్యద్ నవీద్ సైఫ్ హుస్సామీ, అతీకుర్ రెహమాన్, తాండ్ర సదానందం పెద్ద పెళ్లి పట్టణానికి చెందిన ముస్లిం పతపెద్దలు, రాజకీయ విశ్లేషకులు, ముస్లిం సోదరులు, సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :