Friday, 31 July 2026 03:51:23 PM

ఈడీ కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్న బిజెపి ప్రభుత్వం...

Date : 16 April 2025 09:59 PM Views : 397

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / యైటింక్లెయిన్ కాలనీ (గోదావరిఖని) : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు 8వ కాలనీ న్యూమారేడుపాక 19వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు బాధ్యులు మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఈడీ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ లకు ఏ దేశ ప్రజల అండ ఉందని వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి 19వ డివిజన్ ఇంచార్జి ఎండి యాకూబ్. కార్యకర్తలు కేశవులు. నరేష్. రామ్మూర్తి. రమేష్. చిరంజీవి. కోట శ్రీజ. స్వప్న.మల్లారెడ్డి. సురేందర్. అన్వేష్. వెంకటేష్.గోవర్ధన్. చంద్రమౌళి. రాజయ్య. నవీన్. ఎల్లయ్య. శివ. లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :