ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో సుమారు మూడు లక్షల జనాభా కలిగిన ఈ ప్రాంతానికి ఒక్క సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ పార్టీలకు అతీతంగా ఎన్నో ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేయడంతో పాటు ఉన్నతాధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం స్పందించి రామగుండం నియోజకవర్గానికి సబ్ రిజిస్టర్ కార్యాలయం మంజూరు చేయడంతో స్థానిక ఎమ్మెల్యే, ఇతర ఉన్నతాధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు.అయితే ఈ కార్యాలయ ఏర్పాటుతో ఎంతో మంది స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వారు భావించి కార్యాలయ సమీపంలో కొంత మంది ఇక్కడి ప్రాంతానికి చెందిన వారు దస్తావేజుల లేఖల కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. అంత బాగానే ఉంది అనుకున్న సమయంలోనే ఇక్కడి ప్రాంతానికి వచ్చి మల్లి వివాదాలకు నిలయంగా మార్చుతూ వారిదే పెత్తనం సాగిస్తున్నారు. దీంతో వారు చేసే పనుల వాళ్ళ కొత్త తలనొప్పి వచ్చి పడుతుంది. మరో వివాదానికి దారి తీస్తుంది. ఎక్కడ చుసిన వారిదే పెత్తనం సాగలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
వచ్చి రాగానే భూ వివాదంలో తలదూర్చిన వైనం...
వచ్చి రాగానే పెద్దపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడి దస్తావేజుల కార్యాలయం ఏర్పాటు చేసుకొని ఓ భూ వివాదంలో తలదూర్చినట్లు తెలుస్తోంది. సబ్ రిజిస్టర్ కార్యాలయ సమీపంలోనే ఉన్న ఓ భూమిని యజమానికి తెలియకుండానే పక్కనే ఉండే మరో వ్యక్తి పేరు మీదకి మారింది. అయితే కొన్ని రోజుల తర్వాత సదురు భూ యజమాని చూసుకోగా అది తన పేరు మీద కాకుండా మరొక్కరి పేరు మీద చూపిస్తూ ఉండటంతో వెంటనే పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో ఇది పసిగట్టిన సదురు పెద్దపల్లికి చెందిన వ్యక్తి వెంటనే షాపు మూసివేసుకొని పరారయ్యాడు. కొన్ని రోజులు ఆజ్ఞతంలోకి వెళ్లినట్లు సమాచారం.
పెద్దపల్లి పెత్తనం.... రామగుండంలో ఎక్కడిది...?
రామగుండం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు కాక ముందు పెద్దపల్లిలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఇక్కడి ప్రాంత ప్రజలు వెళ్లే వారు. అక్కడ వారు గతంలో ఎంత చెప్పితే అంత ఇష్టం వచ్చినట్లు వసూళ్లు చేసే వారు.దీంతో ఏమి తెలియక చాల మంది ప్రజలు ఆర్ధిక దోపిడీకి గురయ్యే వారు. ఇది ఇలా ఉంటె కొంత మంది చేసిన పనుల వాళ్ళ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించిన సంఘటనలు సైతం కో కొల్లోలుగా ఉన్నాయి.అయితే ఎప్పుడు మల్లి కొంత మంది చేసే పనుల వాళ్ళ మల్లి అలాంటి పరిస్థితి వస్తుందేమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు పెద్దపల్లిలో సబ్ రిజిస్టర్ కార్యాలయం నడిచిన ఇన్నీ సంవత్సరంలో అక్కడ షాపు నిర్వహించుకునేందుకు కనీసం గోదావరిఖని ప్రాంతానికి చెందిన వారికీ ఒక్కరికి ఐన అవకాశం కల్పించారా...? ఈ ప్రాంతానికి చెందిన వారు మీ లాగే ఎవరినైనా ఇబ్బందులకు గురి చేసారా...? పెద్దపల్లి లో పెత్తనం మీదే... రామగుండంలోను పెత్తనం మీదేనా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికైనా దీనిపై స్థానిక నాయకులు అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.
Reporter
Aakanksha News