Friday, 31 July 2026 03:38:24 PM

అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు...

Date : 14 March 2025 09:15 PM Views : 704

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : అక్రమంగా నిర్వహించిన 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ రాజేష్, టాస్క్ ఫోర్సు సిబ్బందితో కలిసి పెద్దపల్లి జిల్లా పరిధిలోని బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాల గ్రామం లో ఒక షెడ్ లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచారనే పక్క సమాచారం మేరకు తనిఖీ చేయగా అక్కడ ఉన్న గోదావరిఖనికి చెందిన బోయిని పెద్ద రాజాం,కన్నాలకు చెందిన పాస్తం బాబును అదుపులోకి తీసుకుని, పిడియస్ రైస్ తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఆటో ట్రాలీ, నిల్వ ఉన్న 20 క్వింటల్లా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం బసంత్ నగర్ పోలీస్ వారికీ అప్పగించడం జరిగిందని పట్టుకున్న పీడీఎస్ బియ్యం విలువ సుమారు 78,000 రూపాయలు ఉంటుందని స్పష్టం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :