Friday, 31 July 2026 01:24:48 PM

బెదిరింపుల ధోరణిలో... రామగుండం పాలన సాగుతోంది...

అధికారుల తీరుపై న్యాయ పోరాటానికి సిద్ధం... ఓల్డ్ అశోక భాధితులు

Date : 20 December 2024 12:23 PM Views : 1087

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : బెదిరింపుల ధోరణిలో రామగుండం పాలన సాగుతుందని, అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఓల్డ్ అశోక భాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓల్డ్ అశోక భాధితులు పులిపాక రాజ్ కుమార్, గాదె రామదాసు లు మాట్లాడుతూ... అభివృద్ధి పేరుతో షాపులను కూల్చివేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. మాకు న్యాయం చేయాలని ఎంతో మంది అధికారులను నాయకులను వేడుకొన్న ఎటువంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. కోర్టు ఉత్తర్వులను సైతం పట్టించు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో దౌర్జన్యంగా కూల్చివేతలు మొదలు పెట్టడం వల్ల ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లకు పైగా జీవనం సాగిస్తున్న మాకు ఎటువంటి ప్రత్యామ్యయం చూపించకుండా కూల్చివేతలు ప్రారంభించాలన్నారు. ఇప్పుడున్న కొంత మంది నాయకులు ఓల్డ్ అశోక స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 100కోట్ల నుండి 1000కోట్ల రూపాయల సంపాదించడమే లక్ష్యంగా కొంత మంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా కూల్చివేసిన అధికారులు నాయకులపై చట్టపరమైన చర్యలకు న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో గాదే ఉపేందర్, రంగు కోటేశ్వర్, సత్యనారాయణ, షేక్ అయ్యాజ్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :