Thursday, 30 July 2026 05:39:54 PM

భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారానికి దారితీస్తోంది....

– తహసీల్దార్ ధీరజ్ కుమార్

Date : 05 June 2025 06:21 AM Views : 491

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం ఒక కీలకమైన మార్గదర్శకంగా నిలుస్తుందని ఓదెల తహసీల్దార్ ధీరజ్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని కొలనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి సదస్సులో ఆయన మాట్లాడారు.రైతుల భూములపై ఉన్న వివాదాలు, రికార్డు లోపాలను చక్కబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా పరిష్కారానికి అవకాశం ఉందని ఆయన వివరించారు. సమస్యలు ఉన్న రైతులు నేరుగా దరఖాస్తు చేయడం ద్వారా అధికారులచే తక్షణమే పరిష్కారానికి ప్రయత్నాలు జరగనున్నాయని పేర్కొన్నారు.కోమిరే గ్రామంలో నిర్వహించిన మరో భూభారతి సదస్సులో డిప్యూటీ తహసీల్దార్ సతీష్ రావు ఆధ్వర్యంలో రైతుల నుండి భూమికి సంబంధించిన వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ రెండు సదస్సుల్లో మొత్తం 100 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో కొలనూరులో 93, కోమిరేలో 7 దరఖాస్తులు అందాయని తహసీల్దార్ ధీరజ్ కుమార్ తెలిపారు.రైతుల సమస్యల పరిష్కారంలో ఈ చట్టాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :