Sunday, 26 April 2026 06:43:00 PM

వర్కింగ్ జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి....

- డబ్ల్యూజేఐ ఉగాది పంచాంగం ఆవిష్కరించిన అదనపు కలెక్టర్..

Date : 07 April 2025 07:34 PM Views : 401

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : వర్కింగ్ జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) రూపొందించిన శ్రీవిశ్వావసు నామ సంవత్సర పంచాంగ డైరీని ఆవిష్కరించిన ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధిలా నిలుస్తూ సమస్యలను వెలుగులోకి తేవడంతో పాటు, ప్రభుత్వ పథకాల అభివృద్ది ఫలాలను లబ్దిదారులకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రాణాప్రతాప్ రజ్జూభయ్య మాట్లాడుతూ, జర్నలిజాన్ని నమ్ముకుని కడుపేదరికాన్ని అనుభవిస్తున్న జర్నలిస్టులకు డబ్ల్యూజేఐ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహ కార్యనిర్వహణ కార్యదర్శి బెజ్జంకి నరేష్, నాయకులు ఎర్రోజు వేణుగోపాల్, జంగ సంపత్, రేవెల్లి తిరుపతి, పూసాల వెంకటేష్, మంథని క్రిష్ణ, పెర్క నీరజ్, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :