Thursday, 30 July 2026 06:40:36 PM

విద్యార్థులతో వెట్టి చాకిరీ చేస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం... బడి పిల్లలే పని పిల్లలుగా మారుతున్న వైనం...

లక్ష్యాల్లో తల్లిదండ్రుల నుండి ఫీజులు వసులు చేసేది ఇందుకోసమేనా... ?

Date : 01 August 2025 02:36 PM Views : 1065

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : హంగులు ఆర్భాటాలతో తల్లిదండ్రులను ఆకర్షించే ప్రకటనలతో మీ పిల్లల భవితకు బంగారు బాటలు వేసే బాధ్యత మాది అని వారి చేత లక్షలల్లో కూడా అప్పులు చేయించి వారి పిల్లలని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తూ ఉంటే విద్యార్థులచే పాఠశాల పనులు చేయించుకుంటున్న దౌర్భాగ్య స్థితి గోదావరిఖని సప్తగిరి కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో కనిపిస్తుందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ అన్నారు.తల్లిదండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు బాగుండాలని ఒకే ఒక్క ఆలోచనతో కార్పొరేట్ పాఠశాలల మాటలను నమ్మి లక్ష్యాల్లో స్కూల్ ఫీజులు యూనిఫామ్, బుక్స్, ట్రాన్స్పోర్ట్ ఇలా వేటికి ఎంత కట్టమంటే అంత అప్పు చేసి కడుతుంటే వారి పిల్లలతోటే స్కూల్ ఆవరణలో వెట్టి చాకిరి చేపించుకోవటం దుర్మార్గమన్నారు. పిల్లలని వారి తల్లిదండ్రులు పంపించేది పాఠాలు నేర్చుకోవడానికా లేకుంటే పాఠశాల ఆవరణలో పనులు చేయడానికా యాజమాన్యం సమాధానం చెప్పాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. పాఠశాలకు సంబంధించి ఏ పనులున్నా కానీ కార్మికులను గాని పని వాళ్ళని పెట్టుకొని చేపియాలి కానీ పాఠాలు నేర్చుకునే పసిపిల్లలతోటి పాఠశాల ఆవరణ పనులు చేపియ్యడం ఏమిటని వాళ్ళు ఈ సందర్భంగా ప్రశ్నించారు. పారిశ్రామిక ప్రాంతంలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న పూర్తిస్తాయిలో అనుమతులు లేని కార్పొరేట్ పాఠశాలలపై సంబంధిత అధికారులు ఇప్పటికి చర్యలు తీసుకోకపోవడం ఎవరెన్ని ఫిర్యాదులు చేసిన మొక్కుబడిగా తనిఖీలు చేసి కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలకి వత్తాసు పలకడం పరిపాటిగా పారిశ్రామిక ప్రాంతంలో మారిందని దీని ఫలితంగానే కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు మమ్మల్ని ఎవ్వరు ఏమి చేయరనే ధీమా తోటి విచ్చలవిడిగా వారు ఆడిందే ఆట పాడిందే పాట పెట్టిందే ఫీజులు అనే పరిపాటిగా పారిశ్రామిక ప్రాంతం మారిందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. ఇటువంటి ఘటనలు సర్వత్ర తల్లిదండ్రులలో ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థులతో వెట్టిచాకేరి పనులు చేయిస్తున్న సప్తగిరి కాలనీ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతంలో పూర్తిస్థాయిలో అనుమతులు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై శాఖ పర్యమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :