Saturday, 13 June 2026 02:47:44 PM

గోలివాడ ప్రదీప్ కుమార్ కు విలేజ్ ఇన్నోవేషన్ అవార్డు...

ఆకట్టున్న వాటర్ సైకిల్ ఆవిష్కరణ... అవార్డుకు ఎంపిక చేసిన టీజీఐసీ సంస్థ

Date : 23 January 2025 01:15 PM Views : 478

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన గోలివాడ ప్రదీప్ కుమార్ గంగపుత్ర యువకుడు విలేజ్ ఇన్నోవేషన్ అవార్డు -2025కు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇన్నోవేషన్ సెల్(టీజీఐసి) ద్వారా ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రాంతాల నుండి‌ వచ్చిన యువకులను ప్రోత్సహిస్తోంది. ప్రజలకు ఉపయోగపడే వస్తువులను కొత్తగా ఆవిష్కరణ చేసిన యువతకు ఈ ఏడాది విలేజ్‌ ఇన్నోవేషన్ అవార్డు-2025లను ఇస్తోంది. ఈ అవార్డుకు రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన గోలివాడ ప్రదీప్ కుమార్ గంగపుత్ర ఎన్నికయ్యాడు. వినూత్నంగా ఆకట్టుకునే వాటర్ సైకిల్ ను తయారు చేశాడు. పర్యాటక రంగానికి, మత్స్యకారులకు, ప్రజల ఆరోగ్యం కోసం ఈ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని టీజీఐసి గుర్తించింది. వాటర్ సైకిల్ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన గోలివాడ ప్రదీప్ కుమార్ గంగపుత్రను అభినందించిన టీజీఐసి, విలేజ్ ఇన్నోవేషన్ అవార్డు-2025కు ప్రదీప్ కుమార్ ను ఎంపిక చేసిందని ఎల్లంపల్లి గ్రామ‌కార్యదర్శి సాగర్ తెలిపారు. జనవరి 26న అవార్డు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. గోలివాడ ప్రదీప్ కుమార్ గంగపుత్ర ఈ అవార్డు గెలుచుకోవడం పై ఎల్లంపల్లి మాజీ సర్పంచ్ గుమ్ముల రవిందర్, గ్రామస్తులు ధర్మాజీ శ్రీనివాస్, ధర్మాజీ కుమార్, గుమ్ముల‌ శ్రీకాంత్, గోలివాడ శేఖర్, కంది విజయ్ కుమార్, నున్న అజయ్ కుమార్, సంతోష్, కిషోర్ , రాజు కుమార్ తో పాటు పలువురు హర్షం వ్యక్తం చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :