ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం సావిత్రిబాయి పూలే అని రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ కందుల సంధ్యారాణి అన్నారు. ఈ సందర్బంగా జీడికే -1&3 ఇంక్లైన్ గని మీద సావిత్రిబాయి పూలే 194 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.సింగరేణి బీసీ అసోసియేషన్ ఫీట్ సెక్రటరీ చెరుకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుల సంధ్యారాణి హాజరై పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ..సావిత్రిబాయి పూలే విశేషాలు, సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన కృషిని వివరించారు. మహిళా వివక్షతపై, సమాజంలోని అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన భారతదేశపు తొలి పంతులమ్మ సావిత్రీబాయి పూలే అన్నారు.వారు మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం అన్నారు. సావిత్రిబాయి పూలే చూపిన దారిలో నడవడమే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గం అన్నారు.విద్య ద్వారా ఆర్థిక, సామాజిక ప్రగతిని సాధించవచ్చు అని, అందరూ కలిసికట్టుగా పని చేసి మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో BC అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి, కోశాధికారి వూట్ల దేవాచారి, గని మేనేజర్ డీ. రమేష్, ఇతర అధికారులు, అన్నీ యూనియన్ల పిట్ సెక్రటరీలు, బీసీ సంఘం ప్రముఖులు చెన్న సతీష్, మానాల శ్రీనివాస్, పెర్క మహేందర్, ఇక్బాల్ షరీఫ్, జనగామ రాయలింగు, అంకులు, స్వప్న,కోమల మహేష్ ,మచ్చ విశ్వాస్ తదితరులు పాల్గొన్నారు..
Admin
Aakanksha News