Friday, 31 July 2026 05:43:48 PM

రక్షణ సూత్రాలు పాటిస్తూ ఉత్పత్తి లక్ష్యాలపై దిశా నిర్దేశం...

వకిల్ పల్లి గని బొగ్గు ఉత్పత్తిని సమీక్షించిన జీఎం ఆర్జీ-2 బి.వెంకటయ్య

Date : 22 November 2024 04:24 PM Views : 545

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : వకీల్ పల్లి గనిని ఏరియా జనరల్ మేనేజర్ బి.వెంకటయ్య సందర్శించారు. ఆయన ముందుగా గని పని స్థలాలను సర్వే మ్యాప్ ద్వారా పరిశీలించి 3 సిమ్ టాప్ సెక్షన్ లో మరియు 4 సిమ్ లో నడుస్తున్న ఎల్ హెచ్ డి, కంటిన్యుస్ మైనర్ యొక్క బొగ్గు ఉత్పత్తిపై అధికారులతో సమీక్షించారు. ఏరియా జనరల్ మేనేజర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా వకీల్ పల్లి గనికి వచ్చిన బి.వెంకటయ్య ను గని అధికారులు శాలువాతో సన్మానించి పూల బొకే అందించారు. ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతున్న క్రమంలో గనికి కేటాయించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను రక్షణ సూత్రాలు పాటిస్తూ గనిలో ఒక చిన్న ప్రమాదం జరగకుండా బొగ్గు ఉత్పత్తి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలనీ ఏరియా జనరల్ మేనేజర్ బి.వెంకటయ్య అధికారులకు దిశా నిర్దేశం చేశారు.వారి వెంట గని ప్రాజెక్ట్ అధికారి ఏ.నెహ్రా, గని మేనేజర్ రవి కిరణ్, గ్రూప్ ఇంజినీర్ చంద్ర శేఖర్, అడిషనల్ మేనేజర్ తిరుపతి, రక్షణ అధికారి రామ్ కుమార్, సర్వే అధికారి అఫ్సర్ పాషా, మరియు డివైపిఎం శ్యామ్ ప్రసాద్ తదితులున్నారు.

రీపోటర్ : సంతోష్ (8వ కాలనీ)

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :