Saturday, 01 August 2026 01:28:22 AM

కోర్టు తీర్పును విస్మరించిన సింగరేణి సంస్థపై భూనిర్వాసితుల ఆగ్రహం....

Date : 30 July 2025 05:42 PM Views : 719

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం అక్కేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్ధపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్.జి–3 పరిధిలోని OC-II ప్రాజెక్టు విస్తరణ కోసం సింగరేణి సంస్థ భూములను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, కోర్టు తీర్పును పట్టించుకోకుండా ఇళ్ల కూల్చివేతకు వచ్చిన అధికారులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. భూముల విలువను తక్కువగా నిర్ణయించడంతో పాటు, ఇళ్ల నిర్మాణ ఖర్చులు, కట్టడాల అంచనాలు తగిన విధంగా లెక్కించలేదన్న కారణాలతో భాదితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కోర్టు భూ నిర్వాసితుల పక్షంలో తీర్పు ఇవ్వగా, ప్రభుత్వం లేదా సింగరేణి సంస్థ ఈ తీర్పును అమలు చేయకపోవడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “కోర్టు తీర్పును ధిక్కరించడం దుర్మార్గం. న్యాయ వ్యవస్థను అవమానించడం” అంటూ బాధితులు మండిపడ్డారు. తమ ఇళ్లను కూల్చివేయడానికి అధికారుల వచ్చారన్న వార్త వెలువడిన వెంటనే భాదితులు సమూహంగా చేరి వాటిని అడ్డుకున్నారు. “న్యాయాన్ని గౌరవించి... నష్టపరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం 100% నష్టపరిహారం చెల్లించేవరకు తమ ఇళ్లను తాకేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :