Friday, 31 July 2026 10:38:17 PM

ఘనంగా పొన్నం జన్మదిన వేడుకలు

జిల్లా ఆర్టిఏ మెంబర్ మంథని సురేష్

Date : 08 May 2025 01:16 PM Views : 676

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : తెలంగాణ రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలను మంథనిలో ఘనంగా నిర్వహించారు. మంథని బస్టాండ్ లో కేక్ కట్ చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టిఏ మెంబర్ మంథని సురేష్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎన్ ఎస్ యు ఐ స్థాయి నుంచి అంచలంచలుగా ఎదిగి అనేక పదవులను పొంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టే సమయంలొ పొన్నం ముందు వరసలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో తాటి సమ్మయ్య గౌడ్ (టిసాప్), గౌడ సంఘం నాయకులు పొన్నం చంద్రయ్య గౌడ్, పొన్నం మోహన్ గౌడ్, కమ్మగొని రవి గౌడ్, తాటి సంతోష్ గౌడ్, ఆటో యూనియన్ నాయకులు ఎండి షఫీ, బొలిశెట్టి సతీష్, బండారి నవీన్, నాయి బ్రాహ్మణ నాయకులు మంథని రామచంద్రం, మంథని సూరి, మంథని ప్రదీప్, మంథని సాయి తదితరులు పాల్గొన్నారు.

MAHENDAR

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :