Thursday, 30 July 2026 11:02:50 AM

అసంతృప్తిలో అధికార పార్టీ కార్పొరేటర్లు...?

0

Date : 02 October 2022 11:10 PM Views : 642

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కరీంనగర్ జిల్లా : గోదావరిఖని :అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. దీంతో రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే కొంతమంది కార్పొరేటర్లు రహస్య సమావేశమై చర్చించుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సుమారు అధికార పార్టీకి చెందిన 25 మంది కార్పొరేటర్లు సమావేశమై తమ సమస్యలతో పాటు డివిజన్ లో నెలకొన్న సమస్యల పరిష్కారం చూపడంతో పాటు సంక్షేమ పథకాలు, దళిత బంధు విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు తమ ఆవేదనను వినతిపత్రం రూపంలో 25 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసి తెలియజేశారు. దీంతో నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దీంతో వినతి పత్రం రూపంలో తమ ఆవేదనను ఎమ్మెల్యేకు తెలియజేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. కార్పొరేటర్లు చేసిన వినతిపై ఎమ్మెల్యే స్పందించి వారితో ఎటువంటి చర్చలు నిర్వహించి ఏలా బుజ్జగిస్తారో వేచి చూడాల్సిందే.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :