Saturday, 13 June 2026 02:36:44 PM

RFCL బాధితులకు న్యాయం చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతమ్...

ఏఐవైఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య...

Date : 27 January 2023 01:29 PM Views : 950

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : RFCL లో ఉద్యోగాలు పెట్టిస్తామని నిరుద్యోగ యువకులను మోసగించి స్థానిక శాసనసభ్యునీ అండతో దళారులు కోట్ల రూపాయలు వసూలు చేసి నిరుద్యోగుల జీవితాలను రావణ కాష్టంగా మార్చడాన్ని నిరసిస్తూ అఖిలభారత యువజన సమాఖ్య (AIYF)రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఆర్ ఎఫ్ సి ఎల్ అమరుడు ముంజ హరీష్ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు.ఈ సంధర్భంగా AIYF వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య మాట్లాడుతూ... స్థానిక శాసన సభ్యులు అండతో ఆర్ ఎఫ్ సి ఎల్ దళారులు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు పెట్టిస్తామని వందలాదిమంది నిరుద్యోగుల దగ్గర ఐదు నుండి పది లక్షలు, దాదాపుగా 40 కోట్ల రూపాయలు వసూలు చేసారని అన్నారు.ఆలాగే ఆర్ ఎఫ్ సీ ఎల్ లో కాంట్రాక్టర్ మారినా అనంతరం ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి నిరుద్యోగులు దిక్కు దిక్కుతోచని స్థితిలో దళారులకు ఇచ్చిన డబ్బుల సంబంధించిన అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటుంటే వారిని ఆదుకోకుండా ఎమ్మెల్యే అండతో దళారులు దాటవేత ధోరణితో ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని ఆర్ ఎఫ్ సి ఎల్ దళారుల పై సి బి సి ఐ డి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. RFCL దళారుల మూలంగా ఆత్మహత్య చేసుకున్న అమాయక నిరుద్యోగ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పరిమితికి మించి ఉద్యోగ పాస్ లు జారీ చేసిన 5స్టార్ కంపెనీ మీద RFCL అధికారుల మీద విజిలెన్స్ విచారణ జరిపించాలని అన్నారు. ఇంత మంది నిరుద్యోగుల జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఎమ్మెల్యే కి ప్రజా కోర్టు లో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ మొత్తం అవినీతిలో ఉన్నటువంటి దళారుల ఆస్తులను జప్తు చేసి ఆర్ ఎఫ్ సి ఎల్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని లేని పక్షంలో అఖిలభారత యువజన సమైక్య పక్షాన పోరాటం మరింత ఉధృతం చేస్తామని నెల రోజుల్లో బాధితులందరికీ డబ్బులు చెల్లించని పక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆమరణ దీక్ష కూర్చుంటామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు సాదుల శివకుమార్, ఆసాల నవీన్ , శనిగరపు చంద్రశేఖర్,రాణవేణి సుధీర్, కోడం సునీల్, భూసారపు రాజు ,పునీంద్ర, కరీం పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :