Friday, 31 July 2026 01:13:49 PM

దేశ రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు శ్రీకారం...!

బీఆర్ఎస్ నాయకురాలు కందుల సంధ్యారాణి.

Date : 19 September 2023 09:11 PM Views : 688

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నందుకు రామగుండం నియెజవర్గంలో మహిళలు సంబరాలు నిర్వహించారు. రామగుండం నియొజకవర్గంలోని పలు డివిజన్ ల నుండి మహిళలంతా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఇంటికి చేరుకొని సంబరాలు జరిపారు. ఈ సంధర్బంగా సంధ్యారాణి మాట్లాడుతూ.. మహిళా బిల్లు ఆమొదంతో దేశ, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందని అన్నారు.మహిళలు దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇది ఆరంభం అని,మహిళా సాధికారతతో దేశాన్ని బలోపేతం చెయ్యడం ఇక సులభతరం అన్నారు. ఆకాశంలో సగం, అవనిలో సగమైన స్త్రీలకి చట్ట సభల్లో అవకాశాలు కల్పించాలని దశాబ్దాల కాలంగా చేస్తున్న పొరాటం ఫలిస్తున్న సందర్బంగా మహిళలందరికి శుభాకాంక్షలు తెలియజేసారు.మహిళలు ఎందులోను తక్కువ కాదని నిర్ణయాలు తీసుకునే చోట మహిళా నాయకత్వం, వారి ప్రాతినిద్యం ఉండాలని అన్నారు. కేంద్ర క్యాబినెట్ మీటింగ్ లో మహిళా బిల్లు ఆమొదించాలని నిర్ణయం తీసుకోవడం వల్ల దేశ, రాష్ట్రాల్లోని మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.గత మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న తనకి వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న ఇక్కడి మహిళలంతా ఈ నిర్ణయనికి రావడంతో సంతోషిస్తూ నాతోటి సంబరాలు జరుపుకోవాలని ఇక్కడికి రావడం సంతోషంగా భావిస్తున్నానని అన్నారు.రాబోయే రోజుల్లో అందరం కలిసి కట్టుగా, సమిష్టి కృషితో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ రామగుండం స్థానాన్ని కైవసం చేసుకొని ఈ ప్రాంత అభివృద్దికి కృషి చెద్దాం అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళలు క్రిష్ణవేణి.లత, సంపూర్ణ, పుష్ప, చైతన్య,సౌందర్య, మౌనిక, రెహన, రాజమ్మ, ప్రవళ్లిక, పద్మ, రజియ తదితరులు పాల్గోన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :