Saturday, 13 June 2026 02:36:00 PM

25 న డిల్లీ కి సీఎం రేవంత్‌ రెడ్డి...

Date : 24 November 2024 06:33 PM Views : 711

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సీఎం రేవంత్‌ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. సోమవారం దేశ రాజధానికి వెళ్లి కాంగ్రెస్‌ అధిష్ఠానంతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై చర్చించే అవకాశం ఉంది.ఈ ఉత్సవాలకు హాజరుకావాలని ఏఐసీసీ పెద్దలను రేవంత్ రెడ్డి కోరనున్నట్లు సమాచారం. సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు సభకు హాజరుకావాలని రాహుల్ గాంధీని కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే కార్పొరేషన్‌ పదవులు, మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్‌ పెద్దలతో రేవంత్‌ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం.మహారాష్ట్ర ఎన్నికల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పాలన ఏ మాత్రం ఇంపాక్ట్‌ చేయలేకపోయింది. ముఖ్యంగా ఆయన ప్రచారం చేసిన స్థానాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించలేకపోయింది. దీంతో మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమికి రేవంత్‌ రెడ్డినే కారణమని అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :