ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : దళారీల కింగ్ దాదాగిరి మరోసారి వివాదాస్పదంగా మారాడు... చూడటానికి అమాయకంగా కనిపించిన ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల వద్ద నుండి కోట్ల రూపాయలను వసూలు చేసి రోడ్డున పడేసిన మహాగనుడు.. రామగుండం ఎరువుల కర్మాకారంలో ఖద్దర్ చొక్కా ముసుగులో లక్షల రూపాయలు చేతులు మారాయి అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు పెట్టిస్తామని అధికార పార్టీకి చెందిన కొంత మంది కార్పొరేటర్లు నాయకులు నిరుద్యోగుల వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేసి వారిని రోడ్డున పడేశారు.. దీంతో ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక పెట్టిన డబ్బులు తిరిగి రాక ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి... ప్రస్తుతం రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఓ కార్పొరేటర్ వెల్లడించిన వివరాలు రామగుండం ఎరువుల కర్మాగారంలో జరిగిన ఉద్యోగాల దందాలో అవినీతిని బట్టబయలు చేస్తుంది.. రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల పేరుతో ఎంతో మంది నిరుద్యోగులు లక్షల రూపాయలు పెట్టి మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అయినా కూడా దళారీలలో మానవత్వం చలించకపోవడం పట్ల పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే మరోసారి ఆర్ ఎఫ్ సి ఎల్ వివాదం తెరి మీదకు వచ్చింది.. రామగుండం కార్పొరేషన్ 10వ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య గతంలో నలుగురికి ఉద్యోగాల విషయంలో 16 లక్షల రూపాయలను గుండు రాజుకు అప్పగించానని తెలిపారు. అయితే మూడు నెలలు పని చేయించుకున్న అనంతరం వారికి జీతాలు సరిగా ఇవ్వకుండా టార్చర్ చేసి విధుల్లో నుంచి తొలగించారని దీంతో తిరిగి బాధితులకు డబ్బులు చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా కాలయాపన చేసుకుంటూ వస్తున్నారని కార్పొరేటర్ తెలిపారు. ఇదే విషయంపై బాధితులు పెద్దపల్లి నుండి వచ్చి తమకు డబ్బులు చెల్లించాలని లేక పోతే ఇక్కడే మందు తాగి చచ్చిపోతామని చెప్పడంతో ఇదే విషయం గుండు రాజు కు ఫోన్ లో తెలపడంతో ఓ బిజెపి నాయకుడి ఇంటికి రమ్మని అనడంతో అక్కడికి వెళ్లానని అన్నారు. అయితే అక్కడే ఉన్న గుండు రాజు, పెంచాల తిరుపతి తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు తనపై దాడి చేశారని పేర్కొన్నారు. దీంతో ఈ ఘటన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చర్చ నియాంశంగా మారుతుంది. ఇప్పటికే డబ్బులు పెట్టి మోసపోయిన ఎంతో మంది నిరుద్యోగులు ఆర్థిక పరిస్థితి బాగాలేక కుటుంబ పోషణలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనాన్ని సాగిస్తున్న దళారీలు మాత్రం లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఆర్ ఎస్ ఎల్ బాధితులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
Admin
Aakanksha News