ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పేద ప్రజలకు కడుపు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చౌకదారుల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. ఎంత పకడ్బందీగా బియ్యాన్ని పంపిణీ చేసినందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన దానిని అక్రమార్కులు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ దందాను అటువైపు లేకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈపాస్ విధానం ప్రవేశ పెట్టినప్పటికీ ఈ దందా మాత్రం కొనసాగుతూనే ఉంది. గతంలో పెద్దపెల్లి జిల్లాలోని రామగుండం కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా సిపి సత్యనారాయణ టాస్క్ ఫోర్స్ సిబ్బందిని నియమించి దాడులు నిర్వహించి భారీగా రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. దీంతో కొద్ది రోజులు బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఈ మధ్యకాలంలో రేషన్ బియ్యం అక్రమ దందాకు కొంతమంది తెర తీసినట్లు తెలుస్తుంది. వీరికి కొంతమంది అధికారులు సైతం సహకరిస్తూ ఉండడంతో ఈ అక్రమ దందా అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రేషన్ బియ్యం ను భారీగా సరఫరా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండి కొడుతున్నారు. ఈ రేషన్ బియ్యం దందాలో అడ్డగుంటపల్లికి చెందిన ఓ స్క్రాప్ నిర్వాహకుడు కీలకంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో వివిధ చోట్ల నిత్యం అనుమానాలు రాకుండా ద్విచక్ర వాహనాలపై బియ్యాన్ని సేకరించి అడ్డగుంటపల్లిలోని ఓ ఇంటిలో నిల్వచేసి పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరుస్తున్నాడనే ఆ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ రేషన్ బియ్యంను బ్లాక్ మార్కెట్ కు తరలించేందుకు వ్యాపారులు నేరుగా కొంతమంది డీలర్లతో కుమ్మక్కై రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించేవారు. దీంతో వ్యాపారికి డీలర్ కు మధ్య వ్యాపారం కొనసాగేది. అయితే ప్రభుత్వం కొద్ది రోజులు రేషన్ షాపులపై నిఘా పెట్టడం, దొరికిన డీలర్ల పై కఠిన చర్యలు తీసుకొని డీలర్ షిప్ ను రద్దు చేయడం వంటి అనేక సంఘటనలు చోటు చేసుకోవడం, ఈపాస్ మిషన్ లు అందజేయడంతో ఈ అక్రమ రేషన్ దందాకు కొంతమేరకు అడ్డుకట్టపడిందనే చెప్పవచ్చు. దీంతో అక్రమార్కులు మరో అడుగు ముందుకేసి హార్ట్ దారుల నుండి ఇంటింటికి తిరుగుతూ బియ్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రారంభించారు. అయితే కార్టుదారుల నుండి కొనుగోలు చేసిన రేషన్ బియ్యంను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ పెద్ద ఎత్తున అక్రమ సరఫరాకు పాల్పడుతున్నారు. అయితే గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన ఓ వ్యక్తి స్క్రాప్ తరలించడంలో కీలకంగా వ్యవహరిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా వివిధ సంస్థలకు చెందిన స్క్రాప్ ను పెద్ద ఎత్తున తరలిస్తూ అక్రమ దందా నిర్వహిస్తున్న సదురు వ్యక్తి ఈ మధ్యకాలంలో కొత్తగా రేషన్ బియ్యం దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు స్క్రాప్ నిర్వాహకుడి పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉండరేమో అన్న అతిశక్తి లేదు. సదరు వ్యక్తి రేషన్ బియ్యం దందాలో అడుగుపెట్టాడో లేదో వివాదం మొదలై అక్రమార్కులు తన్నుకునే స్థాయికి వెళ్లిందంటే సదురు స్క్రాప్ నిర్వాహకుడి పెత్తనం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం ఈ అక్రమ రేషన్ బియ్యం దందాపై దృష్టి సారించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఈ అక్రమ రేషన్ బియ్యం దందాపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Admin
Aakanksha News