ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హన్మకొండ జిల్లా : పోలీసులకు ఊహించని విధంగా షాక్ తగిలింది. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.పదో తరగతి పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ..స్పెషల్ పీపీ సత్యనారాయణ హనుమకొండ ఫోర్త్ ఎంఎం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ను హన్మకొండ జిల్లా కోర్టు తిరస్కరించింది.అలాగే ఈ కేసులో ఏ6, ఏ9 నిందితుల బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. నిందితుల బెయిల్ పిటిషన్ లపై తీర్పు రేపటికి వాయిదా వేసింది.
Admin
Aakanksha News