Saturday, 13 June 2026 02:37:43 PM

మాజీ ఎమ్మెల్యేతో సహా 14 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు..

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసారని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు..

Date : 11 March 2024 04:24 PM Views : 1118

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వరంగల్ జిల్లా : పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని NTPC పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మెరుగు లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తో సహా 14 మంది బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ... తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ తీసుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 యేళ్ల పాటు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లిన అభివృద్ధి ప్రదాత కేసీఆర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పై కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గత నెల 6వ తేదీన NTPC పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో మరికొంత మంది బీఆర్ఎస్ నాయకులు కలసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నో లాఠీ దెబ్బలు తిని 45 రోజులు జైల్లో పెట్టిన బయపడలేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రభుత్వంలో ప్రజా పాలన కాదు పోలీస్ పాలన నడుస్తుందని విమర్శించారు. ఏక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు రానున్న రోజుల్లో పోరాటాలను చేస్తూనే ఉంటామని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. కేసు నమోదు అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుమ్మరి శ్రీనివాస్, ఈదునూరి శంకర్, ఈదునూరి పర్వతాలు, కృష్ణవేణి, పగడపల్లి నారాయణ, గఫార్, బొడ్డుపల్లి శ్రీనివాస్, అచ్చ వేణు, బుల్లెట్ శీను, జావిద్ పాష, భాషాంపల్లి శ్రీనివాస్, మూల విజయ రెడ్డి అయిత శివకుమార్, శ్రావణ్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఎన్టీపీసీ ఎస్ఐ T. ఉదయ్ కిరణ్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు మిగితా వారికి నిందితులు అందరికీ 41-A CrPC నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :