Thursday, 30 July 2026 01:17:09 PM

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యంపై కలెక్టర్ కు ఫిర్యాదు

44 వ డివిజన్ కార్పొరేటర్ ఎండి.ముస్తఫా.

Date : 26 June 2023 05:04 PM Views : 2800

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అడ్డగుంటపల్లి, మార్కండేయ కాలనీలో కొనసాగుతున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం,ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలను కొనసాగిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని కాంగ్రెస్ పార్టీ 44వ డివిజన్ కార్పొరేటర్ ఎండి.ముస్తఫా ఆరోపించారు. అనంతరం పెద్దపల్లిలో ప్రజావాణి నిర్వహిస్తున్న కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలో, మార్కండేయ కాలనీలో కొనసాగుతున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ, కేవలం దనార్జనే ధ్యేయంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమవుతుందని పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరంలోనే ఈ విద్యా సంస్థపై కలెక్టర్ కి ఫిర్యాదు చేయగా డి.ఈ.ఓని విచారణకు ఆదేశించగా కింది స్థాయి సిబ్బంది విచారణలో పలు నిబంధనలు పాటించలేదని తేలిందని అన్నారు. దీంతో నివేదిక ఇచ్చే సమయంలో స్కూల్ యాజమాన్యం వారిని తప్పుదోవ పట్టించి మరల తప్పుడు నివేదికను డి.ఈ.ఓ కి అందించారని ఆరోపించారు. విద్యా సంవత్సరం ఆరంభమైనప్పటికీ ప్రభుత్వ నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గోదావరిఖని పట్టణంలోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యంపై మరొక్కసారి పకడ్బందీగా విచారణ చేపట్టాలని కలెక్టర్ ని కోరారు. వారు వినతిపత్రం స్వీకరించి సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈసారి పకడ్బందీగా తక్షణమే విచారణ చేపట్టాలని డీఈఓని ఆదేశించారని తెలిపారు.ఈ వినతి పత్రం అందజేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్ ఉన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :