ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామాగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తూ హెచ్‌సీఏ సీఈవో సునీల్ చేసిన ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర్చీలు, జిమ్ సామాగ్రితో సహా అనేక పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని సీఈవో ఫిర్యాదులో పేర్కొన్నారు. అజారుద్దీన్‌పై ఐపీసీ 406,409, 420, 465, 467, 471, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Admin
Aakanksha News