ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అక్రమ కేసులు ఎన్ని పెట్టినా ప్రశ్నిస్తూ పోరాడుతూనే ఉంటామని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఫిర్యాదు చేయడానికి చేయడానికి వస్తున్నారని తెలిసి ఏసీపీ పరారయ్యారని, సీఐ పారిపోతారన్నారని తెలిపారు. ఎంత అధికార పార్టీకి ఊడిగం చేస్తే మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేను అధికారికంగా మీ ఆఫీసులోనే కలిసేందుకు కూడా భయమా అని పోలీసులను ప్రశ్నించారు. పట్టుకొని నిలదీస్తే అక్రమ కేసులు పెడతారా అని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
Admin
Aakanksha News