Friday, 31 July 2026 11:29:50 PM

అరగుంట భూమి లేదు... కానీ మూడెకరాల ఆట స్థలం ఉందాట...

పాఠశాల అనుమతులలో ఓ కార్పొరేట్ పాఠశాల బాగోతం...

Date : 13 November 2024 11:15 AM Views : 1183

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : భారీ ప్రచారాలు, హంగులు ఆర్భాటాలతో అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గోరంతలను కొండంత చేసి చూపిస్తూ వీధికొక్కటి చొప్పున పుట్టగొడుగుల్ల పుట్టుకొస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను అదుపు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదావరిఖని పారిశ్రమిక ప్రాంతంలో వెలిసిన కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులను వసూలు చేస్తూ చలిచాలని స్థలం, ఇరుకైన గదులు కనీస సౌకర్యాలు లేని పాఠశాలలో కార్పొరేట్ పేరుతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా ఇరుకు ఇరుకు గదులలో అధిక మొత్తంలో విద్యార్థులను తరగతి గదిలో కూర్చోబెట్టి వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు. దీనికి మార్కండేయ కాలనీలోని ఓ కార్పొరేట్ పాఠశాల నిదర్శనంగా చెప్పవచ్చు. గతంలో ఎటువంటి అనుమతులు లేకుండానే కార్పొరేట్ పేరుతో మార్కండేయ కాలనీలో ఓ కార్పొరేట్ పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా నడిపిస్తుండడంతో దీనిపై విద్యార్థి సంఘాలు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు పాఠశాల ముందు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. ఆ తర్వాత అనుమతి తెచ్చుకున్న ఓ కార్పొరేట్ పాఠశాల దరఖాస్తులో తమకు మూడు ఎకరాల ఆట స్థలం ఉందని పేర్కొనడం విచిత్రానికి దారితీస్తుంది. విద్యార్థులు ఆడుకోవడానికి పాఠశాల ముందు కనీసం అరగుంట ఆట స్థలం లేదు కానీ... మూడెకరాల ఆటస్థలం ఉందట... ఇది స్వయంగా సదరు ఓ కార్పొరేట్ పాఠశాల దరఖాస్తులో పాఠశాల వివరాలను నమోదు చేసింది. అయితే పాఠశాల ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే వివాదాలకు నీలయంగా మారిన సదరు కార్పొరేట్ పాఠశాలకు మూడు ఎకరాల ఆట స్థలం ఉందని అప్పటి అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారో ఇప్పటికీ అర్థం కాని అయోమయ పరిస్థితిలో నెలకొంటున్నాయి. అప్పటి అనుమతి ఇచ్చిన విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ మాయాజాలంలో మునిగిపోయారా..? లేక మరేమైనా అమ్మమ్యాలు అందజేశారా అనే సందేహాలు నెలకొంటున్నాయి. కనీసం ఇప్పటికైనా ప్రస్తుత విద్యాశాఖ అధికారులు సదురు కార్పొరేట్ పాఠశాలపై విచారణ చేపడతారా లేక నామమాత్రంగా విడిచిపెడతారా..? అనేది తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :