Friday, 31 July 2026 06:27:33 PM

ఆర్.ఎఫ్.సి.ఎల్ బాధితులకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇప్పిస్తా...

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

Date : 28 October 2023 11:09 AM Views : 725

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : మూత పడిన ఎఫ్.సి.ఐ ని కాంగ్రెస్ ప్రభుత్వం పున:ప్రారంభం చేసి ఈ ప్రాంతం వారికి ఉద్యోగాలు కల్పించాలని ఆర్.ఎఫ్.సి.ఎల్ ను తీసుకోస్తే స్థానిక శాసన సభ్యుడు ఉద్యోగాలు అమ్ముకున్నరాని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. శనివారం ఆర్.ఎఫ్.సి.ఎల్ గేట్ వద్ద కార్మికులను కలిశారు.ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ... ఈ ప్రాంత ప్రజలు భూములు ఇచ్చి ఊరును త్యాగం చేసిన పిల్లలు డిగ్రీలు పేజీలు చదివిన కూడా కూలి పనికి లక్షల రూపాయిల డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం డబ్బులు పెట్టి మోసపోయిన కుటుంబాలకు కచ్చితంగా 100% డబ్బులు ఇప్పిస్తామని, వారిని జైలుకు పంపిస్తామని అన్నారు.. అప్పులు చేసి ఉద్యోగం కోసం డబ్బులు పెడితే, ఉద్యోగం రాక నా పిల్లలు నా తల్లి నా కుటుంబం ఏమైపోతాదో అని డబ్బులు అడుగుతే బెదిరిపులకు గురిచేస్తున్నరాని అన్నారు.. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఈ దోపిడీ పాలనకు బొంద పెట్టాలని కోరారు. ఈ దోపిడి పాలకులను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని అన్నారు. నన్ను రాజకీయంగా అంతం చేయాలని చూస్తున్నారని అన్నారు.. నిన్న ఒక్క తల్లి కడుపు మండి ఓట్ల కోసం వచ్చిన శాసనసభ్యుడిని నిడదీసిన తల్లికి హ్యాండ్సప్ తెలిపారు. కార్మికులు ఎవరికి భయపడకుండా ధైర్యంగా ఉండాలని మీకు అండగా నేనున్నానని నాపై కేసులు పెట్టిన జైలుకు పంపిన మీ పక్షాన పోరాటం చేస్తానని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతి కార్మికునికి పనికి తగ్గ వేతనం ఇప్పిస్తానని అన్నారు.నేను మీ కుటుంబ సభ్యున్ని గత 25 సంవత్సరాలుగా రామగుండం ప్రాంత సమస్యలపై పోరాటం చేస్తున్న నాకు చేతి గుర్తుకు ఓటు వేసి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :