Saturday, 01 August 2026 01:22:37 AM

కేటీఆర్‌పై 409 సెక్షన్ అమ‌లు చేస్తే దేశంలో గందరగోళం నెలకొనే ఛాన్స్..

కేటీఆర్ త‌ర‌పున అడ్వ‌కేట్ సిద్దార్థ్ ద‌వే వాద‌న‌లు

Date : 31 December 2024 05:57 PM Views : 479

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్ వ్యవ‌హారంపై హైకోర్టులో విచారణ కొన‌సాగుతోంది. కేటీఆర్ క్వాష్ పిటిష‌న్‌పై జ‌స్టిస్ ల‌క్ష్మ‌ణ్ బెంచ్ విచార‌ణ జ‌రుపుతుంది. ఈ కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌ర‌పున అడ్వ‌కేట్ సిద్దార్థ్ ద‌వే వాద‌న‌లు వినిపించారు. లంచ్ స‌మ‌యానికి కేటీఆర్ త‌ర‌పు అడ్వ‌కేట్ వాద‌న‌లను కోర్టు విన్న‌ది. ఇప్పుడు ఏసీబీ త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి. కేటీఆర్ దాఖ‌లు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏసీబీ డీఎస్పీ కౌంట‌ర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. కేటీఆర్‌పై ఉన్న నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని ఏసీబీ కోరింది. నాట్ టు అరెస్ట్‌పై కేటీఆర్ కౌంటర్ అఫిడవిట్ దాఖ‌లు చేశారు.కోర్టులో కేటీఆర్ త‌ర‌పు న్యాయ‌వాది సిద్ధార్థ్ ద‌వే వాద‌న‌లు ఇలా కొన‌సాగాయి. కేటీఆర్ ఫైల్ పైన సంతకం పెట్టాడని కేసు పెడితే దేశంలో ఇక ఏ మంత్రి కూడా ఫైల్ మీద సంతకాలు చేయరు. కేటీఆర్‌పై 409 సెక్షన్ అమ‌లు చేస్తే దేశంలో గందరగోళం నెలకొనే ఛాన్స్ ఉంటుంది. బాంబే హైకోర్టులో ఇప్పటివరకు విచారణ జరిగిన కేసుల ఉదాహరణలు ఎన్నో మీకు అందజేయగలను. పర్మిషన్ తీసుకోలేదన్న విషయానికి సెక్షన్ 405 వర్తించద‌ని అడ్వకేట్ సిద్దార్థ్ ద‌వే కోర్టుకు తెలిపారు.ఒక మంత్రిగా కేటీఆర్ నిర్ణయం తీసుకున్న బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారానే నిధులు ఆర్గనైజింగ్ టీంకు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాయి. ఏసీబీ చెపుతున్న రూ.8 కోట్లు కూడా కేటీఆర్ ఖాతాలోకి వెళ్లవు అని.. అవి కూడా నిర్వహకుల ఖాతాలోకి వెళ్తాయని వాదనలు వినిపించారు సిద్ధార్థ్ ద‌వే.ఇక డబ్బులు చేరిన సంస్థను నిందితుడిగా చేర్చ‌లేదు అని అడ్వ‌కేట్ సిద్ధార్థ్ ద‌వే కోర్టుకు తెలిపారు. విదేశీ సంస్థ పేరు ఏంటని హైకోర్టు ప్ర‌శ్నించింది. దీంతో ఎఫ్ఈవో వివ‌రాల‌ను సిద్ధార్థ్ ద‌వే కోర్టుకు స‌మ‌ర్పించారు. ఈ కేసులో కేటీఆర్‌కు 13(1)(a) సెక్షన్ అసలు వర్తించదు. ఈ డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కాదు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదు కానీ ఇక్కడ ముందుగానే ఉన్న అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేశాము. ఇక్కడ థ‌ర్డ్ పార్టీ లబ్ధి పొందింది అని చెప్తున్నారు కానీ థర్డ్ పార్టీ ఎవరో ఎఫ్ఐఆర్‌లో ఎక్కడా చెప్పలేదు అని కేటీఆర్ త‌ర‌పు న్యాయ‌వాది పేర్కొన్నారు.ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయి అన్న‌ది అవాస్తవం. అప్పటి మున్సిపల్ మంత్రిగా ఆయ‌న‌ ముందు పెట్టిన ఫైల్‌పై సoతకం చేసినందుకు నిందితుడుగా చేర్చారు. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ లబ్ధి పొందలేదు. అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుంది. విదేశీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకోవద్దు అని నిబంధ‌న ఉందా? అలా నిబంధ‌న ఉంటే కేటీఆర్ తప్పు చేసినట్టు.. కానీ ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుంది అని అడ్వ‌కేట్ సిద్ధార్థ్ ద‌వే వాదించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :