Friday, 31 July 2026 02:14:28 PM

రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి....

రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ...

Date : 13 November 2024 02:08 PM Views : 777

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ సమీపంలో రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసి రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అదేశించారు.పెద్దపల్లి రామగుండం మంచిర్యాల మార్గంలోని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఎంపీ కోరారు.గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలుసుకొని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.డిల్లీ నుండి సౌత్ కి నడిచే ఏకైక దారి ఇదే అని రాత్రి జరిగిన ప్రమాదంలో రైలు పట్టాలు తప్పడంతో రాకపోకలు నిలిచి పోయాయని పేర్కొన్నారు.మరో సరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. రైలు పట్టాలు తప్పడానికి కారణాలను వెంటనే అన్వేషించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :