Saturday, 01 August 2026 01:24:51 AM

రైతు రుణ మాఫీ విషయంలో సర్కార్ చెబుతున్నవన్ని ఖాకీ లెక్కలే..

బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Date : 04 October 2024 07:10 PM Views : 426

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / యాదాద్రి భువనగిరి జిల్లా : రైతు రుణ మాఫీ విషయంలో సర్కార్ చెబుతున్నవన్ని ఖాకీ లెక్కలేనని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్లలో జరిగిన రైతు దీక్ష లో పాల్గొని సంఘీభావం తెలిపారు.చందుపట్ల సొసైటీలో 7వేల మంది రైతులు సభ్యులుగా ఉంటే కేవలం 3వేల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. అందరికీ రుణమాఫీ జరిగే వరకు బిజెపి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పారు.చందుపట్ల కో ఆపరేటివ్ సొసైటీ లో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని కోరతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో భువనగిరి, చందుపట్ల రైతులు, సొసైటీ సభ్యులు, బిజెపి కిసాన్ మోర్చ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :