Thursday, 30 July 2026 08:41:10 PM

ప్రతి కార్యకర్తకు అండగా గులాబీ జెండా

మంథని బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్ పుట్ట మధు

Date : 04 April 2023 10:38 AM Views : 367

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంథని : తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంథని బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. ఈ మేరకు మంథని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు సమక్షంలో ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్ ప్రతి కార్యకర్తకు అండగా ఉండి ఆదుకుంటున్నాడని ప్రతి ఒక్కరూ మళ్లీ గులాబీ జెండా ఎగరవేసేందుకు సిద్ధమయ్యారని పార్టీని నమ్ముకున్న వారికి పార్టీ అండగా ఉంటుందని పుట్ట మధు కార్యకర్తలకు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :