ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అసెంబ్లీ సమావేశంలో బాలకృష్ణను తలపించే విధంగా సింగరేణి కట్టు బొట్టుతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సింగరేణి కార్మికులను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ...బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు లేదని ఆరోపించారు. ఇక్కడ ఎమ్మెల్యేకు కార్మిక ఉద్యమాలు అంటే తెలియదని ఏ కార్మిక ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర లేదన్నారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో సింగరేణి నికర లాభాన్ని ప్రకటించారని వారు ప్రకటించిన విధంగా సింగరేణి కార్మికులకు 33 శాతం లాభాల వాటను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో వచ్చిన లాభాలను కార్మికులకు చెల్లించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తుందని విమర్శించారు. సింగరేణి కార్మికుల పక్షపాతి అయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 19,వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు సింగరేణిలో ఉద్యోగ అవకాశాలను కల్పించిన ఘనత కేసిఆర్ దే అన్నారు. గతంలో ఎవరు తీసుకుని నిర్ణయాలను కేసీఆర్ తీసుకొని కార్మికులకు అనేక రకాలుగా లబ్ధి చేకూర్చారన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటాపై కార్మికులు చీదరించుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేకత మీద కార్యక్రమాలు చేస్తే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎన్ని రోజుల కేసులు పెడతారని, ఇలాంటి కక్ష సాధింపు చర్యలను ధోరణిని వీడనాడాలని అన్నారు. ఈ నెల 9వ తేదీలోపు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి బట్టి విక్రమార్క చెప్పిన విధంగా సింగరేణి నికర లాభాల వాటా నుండి 33 శాతం సింగరేణి కార్మికులకు ఈనెల తొమ్మిదవ తేదీన చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్, కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి దేవి, గాదం విజయ,నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, రాకం దామోదర్, జడ్సన్, యసర్ల తిమోతి. తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News