Friday, 31 July 2026 01:09:54 PM

పైరవీ సంఘాలను, యాజమాన్య తొత్తు సంఘాలను! తిరస్కరించండి

TGLBKS-IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ

Date : 30 January 2023 02:01 PM Views : 695

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : జీడీకే 2వ ఇంక్లైన్ బావిపై జరిగిన గేట్ మీటింగ్ లో మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న గని కార్మికుల కోసం నిరంతరం శ్రమిస్తూ నిజాయితీగా పనిచేస్తున్న సంఘం తెలంగాణ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం IFTU అని తెలిపారు. విప్లవ ట్రేడ్ యూనియన్ ఐఎఫ్టియు అనుబంధ సంఘంగా కొనసాగుతూ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారంలో యాజమాన్యంతో రాజీలేని పోరాటాలు చేసిన చరిత్ర ఉందన్నారు.అనేక ఆటు పోట్లను ఎదుర్కొంటూ నేడు రాష్ట్ర 11వ మహాసభలను గోదావరిఖనిలో నిర్వహించుకుంటుందని ఈ మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులను కోరారు. ఇంకా ఈ సమావేశంలో ఎం కొమురయ్య, ఎండి యూసఫ్, పెరుక మొండయ్య, NC బాబు ఆబిద్ నిగో, సిహెచ్ శేఖర్ పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :