Thursday, 30 July 2026 01:15:48 PM

పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా మహనీయుల జయంతి వేడుకలు

50 డివిజన్ లలో 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు

Date : 27 March 2023 11:48 AM Views : 832

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : దేశానికి దిశా నిర్దేశం చేసి రూపకల్పన చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు, మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాలను ఏప్రిల్ 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని 50 డివిజన్ లలో 15 రోజుల కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కన్వీనర్ మాదాసు రామ్మూర్తి, కమిటీ సభ్యులు మైస రాజేష్, బొంకూరి మధులు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. 15 రోజుల కార్యక్రమాలను నిర్వహించడానికి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో ద్విగ్గిజయంగా జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. మొదటి రోజు అంబేద్కర్ కు పాలాభిషేకంతో పాటు పూలమాలతో కార్యక్రమాలను ప్రారంభించి బైక్ ర్యాలీ, రామగుండంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, జగ్జీవన్ రావ్ జయంతి సభ, విద్యార్థిని విద్యార్థులకు అంబేద్కర్ పై అవగాహన కార్యక్రమం, ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ తో పాటు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :