Sunday, 26 April 2026 06:48:07 PM

సీపీఐ ప్రజా పోరు యాత్రను జయప్రదం చేయండి

Date : 25 April 2023 08:48 PM Views : 435

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి నియోజకవర్గంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పోరు యాత్ర మంగళవారం 8వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ లు పాల్గొని మాట్లాడారు... బెల్లంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు సీపీఐ చేస్తున్న ప్రజా పోరు యాత్రను ప్రజలు ఆదరించాలని కోరారు. దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న బిజెపికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రజాపోరు యాత్రను జయప్రదం చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి గోదావరి నీరు అందించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని, అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా పోరు యాత్ర దళ సభ్యులు డాక్టర్ శ్రీధర్, బొంతల లక్ష్మీ నారాయణ, అక్కపల్లి బాపు, దాడి గట్టయ్య, పోతుల లింగయ్య, బండారి శంకర్, స్వామిదాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు కాదండి సాంబయ్య, పార్టీ ప్రజా సంఘాల నాయకులు శీలం చంద్రయ్య, ఎగుడ మొండి, మారపేల్లి రవి‌, ప్రజానాట్యమండలి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :