Friday, 31 July 2026 10:36:40 AM

బీఎస్పీతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన పొత్తు ఉంటుంది: కేసీఆర్

Date : 05 March 2024 06:26 PM Views : 481

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ – బీఎస్పీ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్‌తో క‌లిసి పోటీ చేయాల‌ని బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిర్ణ‌యించారు. పొత్తు అంశంపై బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడితో కేసీఆర్ నిర్ణ‌యించారు.బంజారాహిల్స్‌లోని నంది న‌గ‌ర్ నివాసంలో కేసీఆర్‌ను ప్ర‌వీణ్ కుమార్ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ భేటీ సంద‌ర్భంగా పొత్తుపై చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, బాల్క సుమాన్‌తో పాటు ప‌లువురు ప్ర‌తినిధులు పాల్గొన్నారు. భేటీ ముగిసిన అనంత‌రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఎస్పీతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన పొత్తు ఉంటుంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.. బీఎస్పీ హైక‌మాండ్‌తో మాట్లాడి అనుమ‌తి తీసుకున్నారు. ఆ త‌ర్వాత బీఆర్ఎస్, బీఎస్పీ క‌లిపి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు కేసీఆర్. సీట్ల స‌ర్దుబాటు, పొత్తు విధివిధానాలతో పాటు మిగ‌తా విష‌యాల‌న్ని రేపు, ఎల్లుండి ప్ర‌క‌టిస్తాం. కొన్ని సీట్ల‌లో వారు, మేం కొన్ని సీట్ల‌లో పోటీ చేస్తాం. నాగ‌ర్‌క‌ర్నూల్ నుంచి ప్ర‌వీణ్ కుమార్ పోటీ చేస్తారా..? అని మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించ‌గా.. పెద్దప‌ల్లి నుంచి పోటీ చేయొద్దా..? రాష్ట్ర అధ్య‌క్షుడు క‌దా.. వ‌రంగ‌ల్ నుంచి కూడా పోటీ చేయొచ్చు. జ‌న‌ర‌ల్ సీట్ల‌లో కూడా పోటీ చేయొచ్చు అని కేసీఆర్ తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :