Thursday, 30 July 2026 03:57:46 PM

ఎస్టేట్ ఆఫీసర్ సాంబశివరావును వెంటనే అరెస్ట్ చేయాలి...

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు

Date : 06 October 2024 08:52 PM Views : 751

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం పోలీస్ కమిషనరేట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న, ఆర్నకొండ సదానందం ను కులం పేరుతో దూషించి, ఇంటికి రాకుండా గోడ అడ్డం పెట్టించి కుల వివక్ష చూపుతున్న సింగరేణి ఎస్టేట్ ఆఫీసర్ సాంబశివరావును ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం అరెస్టు చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి, మధు రామగుండం సీపీని విజ్ఞప్తి చేశారు. సింగరేణి ఆర్జీ-1 పరిధిలో అనేక మంది అక్రమంగా ఇండ్లు నిర్మించుకొని నివాసముంటున్న వారికి వత్తాసు పలుకుతున్న సాంబశివరావు అన్ని ఆధారాలు, అనుమతులతో ఇల్లు నిర్మించుకొని నివాసముంటున్న కానిస్టేబుల్ ఆర్నకొండ సదానందం ను కావాలని కుల వివక్షతో అనేక ఇబ్బందులకు గురిచేశాడని ఆయన ఆరోపించారు. కార్పొరేషన్ ముందు గల స్థలంలో ఇండ్ల,నిర్మాణం చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నప్పటికీ ఎవరి పట్ల ఎలాంటి చర్యలు తీసుకొని సాంబశివరావు కానిస్టేబుల్ సదానందంను మాత్రం ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. కేవలం కానిస్టేబుల్ సదానందం డబ్బులు ఇవ్వని కారణంగానే తన ఇంటికి వెళ్లకుండా రోడ్డు వైపు గోడ మూయించి వేశారని ఆయన అన్నారు. ఇది కుల వివక్షతో కూడుకున్న అహంకారపూరితమైన నిర్ణయమని తక్షణమే సదానందం ఇంటికి మూసివేసిన దారి గోడను తొలగించి అందరికీ ఉన్నట్లుగానే సదానందం కూడా దారి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తనను ఎస్సీ మాదిగ కులం పేరుతో దూషించడం వల్లనే సదానందం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అంతే కాకుండా రాష్ట్ర డిజిపి కి, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్, స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులకు, మానవ హక్కుల కమిషన్, రామగుండం పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఎస్సీ కులానికి చెందిన వ్యక్తులు ఎవరైనా కులం పేరుతో దూషించారని దరఖాస్తు ఇచ్చిన 24 గంటల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాల్సినప్పటికీ స్థానికంగా ఉండే సీఐ ఉద్దేశపూర్వకంగా సదానందం ఇచ్చిన కేసును నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. 18 రోజుల తర్వాత ఉన్నత స్థాయి పోలీసు అధికారుల, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యుల ఆదేశాల మేరకు సింగరేణి ఎస్టేట్ ఆఫీసర్ సాంబశివరావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు కాబడ్డ సాంబశివరావును అరెస్టు చేయాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :