Friday, 31 July 2026 04:45:08 PM

కేసీఆర్ ముందు చూపుతోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

మంత్రి గంగుల కమలాకర్

Date : 23 April 2023 07:50 PM Views : 434

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో కొనుగోలు కేంద్రాలు ముందుగానే ఏర్పాటు చేయడంతో నష్టం కొద్దిమేర తగ్గిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తడిసిన ధాన్యాన్ని కొంటామని పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. అలాగే ఎకరాకు పది వేల నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు.కరీంనగర్ జిల్లా చొప్పదండి, గంగాదర, హుజురాబాద్ మండలాలతో పాటు, కరీంనగర్ గ్రామీణంలోని చమాన్ పల్లి, తాహెర్ కొండాపూర్, ఫకీర్ పేట్, జూబ్లీ నగర్, చెర్లబూత్కూరు, ముగ్దుంపూర్ తదితర ఆరు గ్రామాల్లో 5వేల ఎకరాల్లో పూర్తి స్థాయిలో పంట నష్టం జరిగిందని వెల్లడించారు. మొదటి విడత పంటనష్టంగా జిల్లాలోని ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఎనిమిదన్నర కోట్లు విడుదల అయ్యాయని త్వరలోనే వాటిని రైతులకు అందజేయడంతో పాటు ప్రస్థుత నష్టాన్ని పూర్తి స్థాయిలో రెండు మూడురోజుల్లోనే అంచనా వేసి ఆదుకుంటామన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :