Thursday, 30 July 2026 12:03:38 PM

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

Date : 17 September 2023 01:39 PM Views : 427

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ విమోచన దినోత్సవం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి 1947 ఆగస్టు 15 న స్వతంత్ర వస్తే మన హైదరాబాద్ రాష్టానికి రాలేదన్నారు అప్పటి నిజాం ప్రభుత్వాన్ని భారత్ లో కలపాలని కేంద్రప్రభుత్వం ఆదేశిస్తే నిజం ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. వెంటనే అప్పటి భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజం ప్రభుత్వాన్ని సైనిక చర్యతో లొంగదీసి 1948 సెప్టెంబరు 17న విముక్తి కల్పించారని వారు అన్నారు. అందుకే మనం స్వతంత్రం వచ్చిన 13 నెలల తరువాత విమోచన దినోత్సవం జరుపుకుంటు జాతీయజెండా ఎగుర వేస్తున్నామని పేర్కొన్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు అమరవీరుల త్యాగాలను గుర్తించకుండా కొన్ని వర్గాల ఓట్ల కోసం విమోచన కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని వారికి తెలంగాణ ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారని వారు హెచ్చరించారు.బీజేపీ నామట్టి నాదేశం కార్యక్రమ రామగుండం నియోజకవర్గం కోఆర్డినేటర్ మామిడి రాజేష్, ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా కార్యక్రమంలో బీజేపీ నాయకులు సిరిశెట్టి మల్లేష్ గౌడ్,బూడిద రమేష్,సితకారి చంద్రశేఖర్,మామిడి సంపత్,అడ్డురి రాజేష్,దరా కుమార్ అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :